![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -473 లో... రుద్రాణి మాటలు నమ్ముతుంది ధాన్యలక్ష్మి. ఈ కావ్య అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటుంది. అందుకే ఇప్పుడే కళ్యాణ్ కి పెళ్లి ఎందుకు అంటుందని అనగానే.. కావ్య ధాన్యలక్ష్మిని కోప్పడుతుంది. ఇప్పుడు మేమ్ మా ఇంటినుండి వచ్చాము. ఈ రోజు అప్పుకి పెళ్లిచూపులు పెళ్లి ఫిక్స్ అయిందని కావ్య అంటుంది. అయితే నీ మనసులో ఏ ఉద్దేశం లేకుంటే కళ్యాణ్ ని పెళ్లి కి ఒప్పించమని ధాన్యలక్ష్మి అనగానే.. అందుకు కావ్య సరే అంటుంది.
మరొకవైపు కళ్యాణ్, అప్పు లు ఒక దగ్గర కలుసుకుంటారు. అప్పు కళ్యాణ్ వంక డైరెక్ట్ గా చూడలేకపోతుంది అప్పు. నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలి. ఈ పెళ్లి బలవంతంగా చేసుకుంటున్నావా? ఇష్టంగా చేసుకుంటున్నావా అని అప్పుని కళ్యాణ్ అడుగుతాడు. ఇష్టం లేదని చెప్పు అప్పు.. నా మనసులో నువ్వున్నావని చెప్తానని కళ్యాణ్ అనుకుంటాడు. ఇష్టపడి చేసుకుంటున్నాను.. మా వాళ్లకి ఇష్టం అని అప్పు అనగానే కళ్యాణ్ బాధపడతాడు. నాకు ఇష్టం లేదు మా వాళ్ళ కోసం చేసుకుంటున్న అని నీతో ఎలా చెప్పగలనని అప్పు తన మనసులో అనుకుంటుంది. కళ్యాణ్ బాధపడుతు.. ఆల్ ది బెస్ట్ చెప్తాడు.ఆ తర్వాత అసలు నువ్వు ఎందుకు మా పిన్నికి మాటిచ్చావ్.. అసలు కళ్యాణ్ మనసులో ఏముందో నీకు తెలుసా? తన మనసులో అప్పు ఉంది అని రాజ్ అంటాడు. మీరు కూడా అనామికలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళది కేవలం స్వచ్ఛమైన స్నేహం మాత్రమేనని కావ్య అంటుంది. అయిన అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని రాజ్ అంటాడు. అదేం లేదు నేను కళ్యాణ్ ని అడుగుతానని కావ్య అంటుంది. మరొకవైపు నేను చేసింది వర్క్ అవుట్ అయిందని రాహుల్ కి రుద్రాణి చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఆ తర్వాత కావ్య కళ్యాణ్ ని పిలిచి.. నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అయిన మీ మధ్య స్నేహం మాత్రమే ఉంది.. నాకు తెలుసు అదేం లేదు కదా అని కావ్య అంటుంది. అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నానని మీ అన్నయ్య నాతో అంటున్నారు.. నువ్వు చెప్పు మీ మనసులో అప్పు ఉందా అని కావ్య అడుగుతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ మనసులో అప్పు ఉంది.. అప్పుని కళ్యాణ్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని రాజ్ అనగానే.. మీకు అర్థం అవడం లేదా కళ్యాణ్ ని అడిగాను అదేం లేదని కావ్య అంటుంది. చెప్పురా నీ మనసులో అప్పు లేదా.. పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదా అని రాజ్ కళ్యాణ్ ని అడుగుతాడు. ఇప్పుడూ అప్పుని ప్రేమించడం ఏంట్రారా చెప్పమని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |